e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

ఎల్‌నినో ప్రభావం.. ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి

రబీ సాగుపై బొప్పాపూర్‌లో గ్రామసభ..
నీటి పొదుపుపై వ్యవసాయ శాఖ అవగాహన.

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 24 మన భారత్ ప్రతినిధి :ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు రానున్న రబీ సీజన్‌లో అప్రమత్తంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రబీ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం రాచర్ల బొప్పాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి–శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యత, రబీ సీజన్‌లో అనుకూలమైన పంటల ఎంపిక, సాగు ఖర్చులను తగ్గించుకునే మార్గాలపై రైతులకు అవగాహన కల్పించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ అధికారి రాజశేఖర్ సూచించారు. మొక్కజొన్న, పెసర, రాగులు, సజ్జలు వంటి పంటలను సాగు పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలని తెలిపారు. కంది, మినుములు వంటి పప్పుధాన్య పంటలను కూడా నేల స్వభావం, వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా పరిశీలించాలని సూచించారు.రైతులు పంటలు వేసే ముందు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని తగిన పంటలను ఎంచుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట నష్టాల ముప్పును సాధ్యమైనంత వరకు నివారించవచ్చని వివరించారు.

అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు.

ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి రబీ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు రాజశేఖర్ తెలిపారు. రైతులు ఈ సమావేశాలకు అధిక సంఖ్యలో హాజరై వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు అనూష, ముకుంద్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 8341991420

User Name : user_name : Oggu mahesh chandra

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE