e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

దుర్గా మాత పూజలు చేసిన ఎస్సై రాధిక..

దేవాపూర్‌లో దుర్గామాతకు ఎస్సై రాధిక ప్రత్యేక పూజలు

మన భారత్, తలమాడుగు,అక్టోబర్ 18,

తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రీ నవశక్తి దుర్గామాత మండల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 18న తలమడుగు ఎస్సై రాధిక పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు, భక్తులు తరలివచ్చారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఉత్సవాల నిర్వహణతో దేవాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో పూజారి శీలం కోటి శివాజీ పంతులు, గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, దాతాజీ కిరణ్, మేనల్వార్ మల్లన్న, నితీష్ రెడ్డి, వెంకటేష్, నారాయణ, అరవింద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు మహిళలు, భక్తులు, దేవాపూర్ గ్రామ ప్రజలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE