e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అభివృద్ధి..

పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణ లక్ష్మి అండ

మన భారత్, భీంపూర్: అక్టోబర్ 17: పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే కుటుంబాలకు సహాయం అందుతోందని పేర్కొన్నారు.

భీంపూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహం సందర్భంగా కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గించడంలో కల్యాణ లక్ష్మి పథకం దోహదపడుతుందని తెలిపారు. వివాహానికి అవసరమైన ఖర్చుల సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కుటుంబాలకు తోడ్పాటుగా నిలుస్తుందని అన్నారు.

పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,ఆత్మ కౌడాల నారాయణ,సంతోష్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE