భక్తిశ్రద్ధలతో శారదాదేవికి కుంకుమార్చన..
మన భారత్, తలమడుగు:అక్టోబర్ 16, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం మహిళలు శారదాదేవి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టి, కుంకుమార్చన ద్వారా తమ భక్తిని చాటుకున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు పాటిస్తూ మహిళలు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని వారు ప్రార్థించారు. రైతులకు...