e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

తెలంగాణ సిద్ధాంతకర్త సేవలు మరువలేనివి..

జయశంకర్ సార్ ఆశయాల సాధనే నిజమైన నివాళి: ప్రభుత్వ విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

PRTU TS నాయకుల ఘన నివాళులు – తెలంగాణ సిద్ధాంతకర్త సేవలను స్మరించిన ఉపాధ్యాయులు

మన భారత్,ఆగస్టు 6 తలమడుగు:

తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా PRTU TS నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PRTU TS రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కలవల శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ సిద్ధాంత బలాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడంతో పాటు, నీళ్లు – నిధులు – నియామకాలపై తెలంగాణ ప్రజలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తిగా ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా జయశంకర్ సార్ ఆశయాలను సాకారం చేయవచ్చని ఆయన అన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులు సమాజ మార్పుకు మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు.

PRTU TS మండల శాఖ అధ్యక్షులు సీమర్ల నరసయ్య మాట్లాడుతూ, జయశంకర్ సార్ కలలు కన్న సమాన అవకాశాలతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని అన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, తెలంగాణ చరిత్రపై అవగాహన పెంపొందించడం ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నాయకులు మాట్లాడుతూ, జయశంకర్ సార్ ఆశయాలు కేవలం తెలంగాణ ఉద్యమానికే పరిమితం కాకుండా విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో నడవడం ద్వారానే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE