e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

గురువును సన్మానించిన కంది శ్రీనివాస్ రెడ్డి..

ఉద్యోగ విరమణ చేసిన గురువును సత్కరించిన కంది శ్రీనివాస రెడ్డి

మన భారత్ | ఆదిలాబాద్:

ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి శనివారం ఓల్డ్ హౌజింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు పీజీహెచ్ఎం కుర్ర రమేష్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన తన గురువుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువు పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటుతూ కుర్ర రమేష్‌తో పాటు ఆయన సతీమణి మాధవిని శాలువాలతో ఘనంగా సత్కరించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి జీవితానికి పునాది వేసేది గురువేనని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యతో పాటు విలువలను బోధించే గురువులు ఎప్పటికీ గౌరవానికి అర్హులని పేర్కొన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువును సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

ఉపాధ్యాయుడు కుర్ర రమేష్ తన సుదీర్ఘ సేవా కాలంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని కుర్ర రమేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు–శిష్యుల మధ్య ఉన్న అనుబంధానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE