విద్యార్థుల పై లాఠీ చార్జీ అమానుషం

Published on

-Advertisement-

విద్యార్థుల పై లాఠీ చార్జీ అమానుషం

-మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

మన భారత్,మొగుళ్ళపల్లి:

నీట్ యూజీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ,అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని విడనాడి విద్యార్థుల పై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మన భారత్ న్యూస్ తో మాట్లాడారు.పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించాలని మండిపడ్డారు.నీట్ పరీక్ష లీకేజీ తో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. న్యాయపరమైన డిమాండ్ తో లక్షలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో అమానుషంగా పోలీసులు లాఠీ చార్జీ చేయడం హేయమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు.విద్యార్థుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలకు 22 లక్షల, 79వేల743 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని,తీరా పేపర్ లీక్ వ్యవహారంలో లక్షలాది మంది తీవ్ర నష్టపోయారని ఆయన ఆరోపించారు.

మీ పవన్ కళ్యాణ్ రిపోర్టర్ మన భారత్ మొగుళ్ళ పల్లి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this