రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

Published on

-Advertisement-

రైతు భరోసాతో రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

– సుంకిడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

మన భారత్, తలమడుగు:

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో, తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందంటూ నాయకులు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా నిధుల విడుదలను దశలవారీగా ప్రారంభించి తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కస్లాల ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ వెంకన్న పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో సాయిలింగి సర్పంచ్ ద్యావరీ పొచ్చన్న, నాయకులు బోండ్ల  మహేందర్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు బాబూకాన్, ఎల్. ప్రవీణ్ రెడ్డి, ఎస్. దేవన్న, విలాస్ యాదవ్, నాడీపీ లింగన్న, రఫీక్, పోతయ్య, లాస్మన్న, దేవిదాస్, మోహన్, గంగారాం, సిలర్ శ్రీరామ్, వెంకన్న, లచ్చన్న, నర్సయ్య, వసంత్ తదితరులు పాల్గొని రైతు భరోసా పథకాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this