రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి అరెస్ట్..

Published on

-Advertisement-
  1. రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి అరెస్ట్

రూ.1.50 లక్షలు డిమాండ్.. రూ.50 వేల వసూలు చేసినట్లు ఆరోపణలు

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రైతులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ బీట్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి హోదాను ఉపయోగించి రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై తలమడుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు చింతలపెల్లి జైభరత్ రెడ్డి, తాండ్ర మహేష్, తాండ్ర నర్సింహులు, యెల్మ రఘువరన్ రెడ్డిల ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ బీట్ అధికారి కృష్ణ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు తలమడుగు ఎస్ఐ డి. రాధిక తెలిపారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం.. కజ్జర్ల–దేవాపూర్ గ్రామాల మధ్య అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ సమీపంలో రైతులు తమ పొలాల్లోని పంట అవశేషాలను కాల్చే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న మొక్కలకు కొంత నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఘటనను ఆధారంగా చేసుకున్న కృష్ణ నాయక్ రైతులను భయపెట్టి మొక్కలకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.1.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తానని బెదిరించినట్లు రైతులు ఆరోపించారు.

దీంతో భయాందోళనకు గురైన రైతులు విడతల వారీగా మొత్తం రూ.50 వేల వరకు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చింతలపెల్లి జైభరత్ రెడ్డి రూ.25 వేలు, యెల్మ రఘువరన్ రెడ్డి రూ.10 వేలు, తాండ్ర మహేష్ రూ.7,500, తాండ్ర నర్సింహులు రూ.7,500 చొప్పున ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

రైతుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన తలమడుగు పోలీసులు నిందితుడు కృష్ణ నాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ డి. రాధిక మాట్లాడుతూ.. ప్రజలను బెదిరించి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Latest articles

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్..

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.....

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో...

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు పలు ప్రయోజనాలు.....

More like this