నకిలీ ఆయుర్వేదం.. నిందితుడి అరెస్ట్

Published on

-Advertisement-

నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్

ఏడాది కాలంగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రులకు వచ్చే అనారోగ్య బాధితులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో ఏడాది కాలంగా పరారీలో ఉన్న నిందితుడు పోలీసులకు చిక్కాడు.

ఆదిలాబాద్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ అలియాస్ కుమార్ అలియాస్ బాబా అలియాస్ గుల్బర్గా కుమార్ (28) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

విచారణలో భాగంగా నిందితుడు అంతర్రాష్ట్ర ముఠాలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ఆయుర్వేద చికిత్స పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాపై కేసులు నమోదు కాగా, ఈ ముఠాకు చెందిన పలువురు సభ్యులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ఈ ముఠా సభ్యులు ఆదిలాబాద్‌తో పాటు నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద అనారోగ్యంతో వచ్చే చిన్నారులు, మహిళలు, వృద్ధులను గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకునేవారని వెల్లడించారు.

బాధితులతో పరిచయం పెంచుకుని తమకు కూడా ఇలాంటి సమస్య ఉండేదని, ఆయుర్వేద మందులతో నయం అయ్యిందని నమ్మబలికి వారి ఫోన్ నంబర్లు సేకరించేవారని తెలిపారు. అనంతరం నిందితుడు తాను ఆయుర్వేద వైద్యుడినని చెప్పి బాధితులకు ఫోన్ చేసి ఇంటికి వ్యక్తులను పంపించేవాడని పోలీసులు వివరించారు.

కొబ్బరి, బాదం, తులసి ఆకులు, పసుపు, యాలకులు వంటి సాధారణ పదార్థాలతో మిశ్రమాలు తయారు చేయించి, ప్రత్యేక మందులు అవసరమంటూ నకిలీ మూలికలను అధిక ధరలకు విక్రయించి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఒక బాధితుడు తన శారీరక వైకల్యంతో బాధపడుతున్న కుమార్తెకు వైద్యం చేస్తామని నమ్మించి రూ.75,500 ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముఠా సభ్యుల వివరాలు బయటపడి పలువురిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 461/2025 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 318(4), 316(5), 61(2) ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి నకిలీ వైద్య చికిత్సలకు గురికావద్దని సూచించారు. గుర్తింపు పొందిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని, అనుమానాస్పద వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం...

More like this

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...