నిండు జీవితానికి-రెండు చుక్కలు

Published on

-Advertisement-

పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం కావాలి

అంకుషాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి

మన భారత్,మొగుళ్ళపల్లి:

ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం పోలియో నిర్మూలనలో భాగంగా చేపట్టిన “నిండు జీవితానికి-రెండు చుక్కలు” అనే పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుషాపురం గ్రామంలో సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులు పాల్గొని గ్రామంలోని 0-5 సంవత్సరాల వయసు లోపు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తల్లిదండ్రులు 0-5 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. చిన్నారుల ఆరోగ్యం ప్రతి కుటుంబానికి అమూల్యమైన సంపద అని పేర్కొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, “రెండు చుక్కలు-జీవితాంతం రక్షణ” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేర్చాలన్నారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని..చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించి..ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కృషి చేసిన ప్రజలకు ఆమె అభినందించారు.

Latest articles

గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్

శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత...

ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన..

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ -చిట్యాల సిఐ వై.సతీష్ మన భారత్,మొగుళ్ళపల్లి: శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చిట్యాల...

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేద్దాం ప్రతి గణపతి మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ తప్పనిసరి ఉత్సవాలు...

అక్కడ గంటల తరబడి ట్రాఫిక్.!

గుడిహత్నూర్‌లో గంటల తరబడి ట్రాఫిక్.. ప్రయాణికుల అవస్థలు సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు మన భారత్,...

More like this