సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

Published on

-Advertisement-

మన భారత్, విజయనగరం: 

గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు”

సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే లక్ష్యం

గంట్యాడ, జూన్ 6: గంట్యాడ మండలంలోని అన్ని గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” కార్యక్రమంలో భాగంగా సూపర్ నారీ యాప్ వినియోగంపై విస్తృత అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన కల్పించి, వారి పొదుపులు మరియు అప్పుల వివరాలను స్వయంగా పరిశీలించుకునే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతి సంఘ సభ్యురాలికి సూపర్ నారీ యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా సభ్యురాలు తన వ్యక్తిగత పొదుపులు, అప్పులు, చెల్లింపుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించారు.

అలాగే సంఘాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సభ్యులు సులభంగా పరిశీలించవచ్చని తెలిపారు. దీనివల్ల పొదుపు ఖాతాలు, రుణాల వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని సభ్యులే స్వయంగా ధృవీకరించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

సభ్యుల ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా గంట్యాడ మండలంలోని అన్ని గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ అవగాహన సదస్సులు, ర్యాలీల్లో ఏపీఎం కె. సులోచనాదేవి, సీసీలు, వీవోలు, ఎల్‌ఎస్‌హెచ్ సభ్యులు మరియు గ్రామ సంఘాల మహిళా సభ్యులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్..

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.....

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో...

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు పలు ప్రయోజనాలు.....

More like this