అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్

ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం – 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 54 మద్యం బాటిళ్లు స్వాధీనం

ఆదిలాబాద్, జూన్ 3 (మన భారత్):
ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు సహకారం అందించే లక్ష్యంతో ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, అలాగే 54 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నంబర్ ప్లేట్లు లేని 6 వాహనాలు గుర్తించగా, ఇద్దరు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఎస్పీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. గంజాయి వ్యసనానికి బానిస అయితే వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు కుటుంబం, సమాజం కూడా నష్టపోతుందని పేర్కొన్నారు. పోలీసు జాగిలం “రూమా” సహాయంతో గంజాయి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

సైబర్ నేరాలపై కూడా ఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు.

నేర నియంత్రణలో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, ప్రతి కాలనీ, వీధి, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సీసీటీవీలు నేరాల నివారణలోనే కాకుండా నేరస్థులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐలు కె. నాగరాజు, రహీం పాషా, కె. ఫణిధర్, ఎస్సైలు విష్ణువర్ధన్, దేవేందర్, పోలీసు జాగిలం రూమా, పోలీసు సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...