విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి..

Published on

-Advertisement-

ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరుకు సీఈ ఛౌహాన్‌కు వినతి

గ్రామ సమస్యలపై స్పందించని ఏఈపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి డిమాండ్

మన భారత్, తాంసి: తాంసి(బి) గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాంసి గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి విద్యుత్ శాఖ సీఈ ఛౌహాన్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, తాంసి గ్రామంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతూ ఉయ్యాలలా ఊగుతున్నాయని తెలిపారు. చిన్నపాటి గాలి, వర్షం వచ్చినా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

అలాగే గ్రామంలో లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని, దీని కారణంగా గృహ వినియోగ విద్యుత్ పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు విద్యుత్ సమస్యలతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామానికి అదనంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయడంతో పాటు కనీసం 10 విద్యుత్ స్తంభాలను (పోల్స్) మంజూరు చేయాలని మెమోరాండంలో కోరారు. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపడి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు.

సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ గ్రామ ప్రజల సమస్యలపై సరైన స్పందన చూపడం లేదని ఆరోపించిన సర్పంచ్, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఈని కోరారు.

తాంసి గ్రామ ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని, ప్రమాదాలకు దారితీసే విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గ్రామాభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, విద్యుత్ సమస్యలు పరిష్కారమైతే ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి పేర్కొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్ ‌.

📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this