e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

మన భారత్ | మల్కాజిగిరి

జన్నారం కాలనీలో జెండావిష్కరణ..

కార్మిక హక్కుల పరిరక్షణకు సీఐటీయూ కట్టుబడి ఉందన్న నాయకులు

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర మండల జన్నారం కాలనీలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జన్నారం కాలనీలోని సీఐటీయూ యూనియన్ కార్యాలయం వద్ద సంఘ జెండాను ఆవిష్కరించి కార్మిక ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ కీసర మండల కన్వీనర్ బంగారు నర్సింగరావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల సాధన, ఉపాధి భద్రత, సామాజిక భద్రత కల్పన కోసం సీఐటీయూ గత 56 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు.

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలే శక్తివంతమైన ఆయుధమని ఆయన పేర్కొన్నారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉంటేనే వారి హక్కులు పరిరక్షించబడతాయని, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు అవుతాయని అన్నారు.

జెండావిష్కరణ కార్యక్రమాన్ని బండి కలమ్మ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక సంక్షేమం కోసం మహిళలు కూడా చురుకుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతే వారి బలమని, హక్కుల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మిక సంఘాల బలోపేతం, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం సాధన కోసం మరింత కృషి చేయాలని నాయకులు సంకల్పం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తార, మంజుల భాయ్, పూజిత భాయ్, మాధురి భాయ్, యాదమ్మ, పోచమ్మ, సాయమ్మ, సుశీల, లక్ష్మి, గౌరీ, తులసి, భారతి, మదరబి, సత్తయ్య, శశి రాజు, మంగుతా నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జన్నారం కాలనీ మహిళలు, సీఐటీయూ కార్యకర్తలు, స్థానిక కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE