e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

రైతులకు న్యాయం జరగకపోతే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్యే

మన భారత్ | భీంపూర్

జొన్న రైతులతో కలిసి భోజనం.. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో జొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన జొన్నలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లోడింగ్ పనుల్లో జాప్యం, గన్నీ సంచుల కొరత, తడిసిన జొన్నల కొనుగోలుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలను రైతులు ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి పండించిన జొన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోవడం, లోడింగ్ ఆలస్యం కారణంగా అకాల వర్షాలకు తడవడం బాధాకరమని అన్నారు. రైతుల శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుల కల్లాల వద్దే కాంటాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన జొన్నలను కూడా కొనుగోలు చేయాలని కోరారు.

రైతుల పంటకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన, కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ సమస్యలు, గన్నీ సంచుల కొరత వంటి అంశాలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే రైతులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించిన ఎమ్మెల్యే, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ ఇస్తారి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుధాకర్, సీనియర్ నాయకులు కేమ శ్రీకాంత్, మండల కన్వీనర్ నాగయ్య, సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ లింబాజీ, ప్రవీణ్, గోవర్ధన్, కపిల్, రాథోడ్ ఉత్తమ్, దినేష్, అనిల్, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

-గొంటిముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE