మాదిగలకు కాంగ్రెస్‌లో అన్యాయం..

Published on

-Advertisement-

మన భారత్ | ఇచ్చోడ

నల్ల జెండాలతో ఎమ్మార్పీఎస్ నిరసన

మండల అధ్యక్షుల నియామకాలలో మాదిగలకు అవకాశం కల్పించలేదని ఆగ్రహం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీపై నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం నాయకులు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మండల అధ్యక్షుల నియామకాలలో మాదిగ సమాజానికి చెందిన ఒక్క నాయకుడికీ అవకాశం కల్పించకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ, జిల్లాలో మెజార్టీ జనాభా కలిగిన మాదిగలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 23 మండలాలకు అధ్యక్షులను నియమించినప్పటికీ ఒక్క మాదిగ నాయకుడికీ బాధ్యతలు అప్పగించకపోవడం బాధాకరమని అన్నారు.

అలాగే ఎస్సీ సెల్ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించకుండా అన్యాయం చేశారని విమర్శించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మాదిగ నాయకులను కేవలం కార్యకర్తలుగానే పరిమితం చేస్తూ రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాదిగ సమాజాన్ని రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం స్పందించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు రాజకీయ న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో మాదిగలకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ మాదిగల అసంతృప్తి, ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుబ్బాక సుభాష్ మాదిగ, గోటిముఖేల్ మధుకర్, సిరిసిల్ల భూమయ్య మాదిగ, మండల అధ్యక్షులు చిట్టి రవి, కాష్పాక విష్ణు, మచ్చ గంగయ్య, ఆరెపల్లి రవి, జుట్టు మల్లేష్, కొత్తూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this