అభివృద్ధికి ఆమడ దూరంలో రత్నాపూర్..!

Published on

-Advertisement-

రోడ్డు లేదు.. బస్సు రాదు.. తాగునీటి సమస్యతో గ్రామస్తుల ఆవేదన

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా | తలమడుగు

సాంకేతికంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన రత్నాపూర్ గ్రామం గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో రహదారి సౌకర్యం లేకపోవడం, అంగన్వాడీ కేంద్రం లేకపోవడం, గ్రామపంచాయతీ భవనం అందుబాటులో లేకపోవడం, తాగునీటి సమస్య రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ ప్రజల ప్రకారం ఎన్నో ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు గ్రామానికి వచ్చి రోడ్డు నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, తాగునీటి సదుపాయం కల్పిస్తామని హామీలు ఇస్తారని, కానీ ఎన్నికలు ముగిసిన తరువాత గ్రామాన్ని పూర్తిగా మరిచిపోతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సులోచన నరేష్ మాట్లాడుతూ గ్రామానికి సరైన రహదారి లేకపోవడం వల్ల వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్నారు. గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ సైతం గ్రామంలోకి చేరుకోలేని పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు.

గ్రామ పటేల్ మేస్త్రం నాగరావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించినప్పటికీ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

గ్రామానికి వెంటనే పక్కా రహదారి నిర్మించాలని, చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మున్నాయి, పెందూర్ ప్రసాద్, అక్రమ్ కోసిరావు, కుమ్రా తెలంగ్ రావు, పెందూర్ శంభు, ఆత్రం సూర్యభాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.. 

Latest articles

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

More like this

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...