బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీకి ఘన సన్మానం

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:
ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్, జిల్లా కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్‌లకు తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో ఘన సన్మానం నిర్వహించారు. గ్రామస్థులు, బీసీ సంఘ నాయకులు కలిసి శాలువాలు కప్పి పూలమాలలతో వారిని అభినందించారు.

అలాగే ఇటీవల బీపీ మండల్ అవార్డు అందుకున్న తలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షుడు రవికాంత్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని గ్రామ పెద్దలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల సాధన, వెనకబడిన బీసీ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం సంఘం మరింత ముందుండి పోరాడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నాయకులు కృషి చేయాలని సూచించారు.

బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ బీసీల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీసీల ఐక్యత కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్, జిల్లా నాయకులు తిరుమనగిరి ప్రశాంత్, ఉపసర్పంచ్ శ్రీరాములు, గ్రామ బీసీ సంఘం అధ్యక్షుడు నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు దాతాజీ, కిరణ్ యాదవ్ సంఘం మండల అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ యాదవ్, గొల్లని మోహన్, ఆడేపు శ్రీనివాస్, రేగుల మోహన్, రమేష్, అశోక్, నగేష్, విష్ణు, సురేష్, రవి, శ్రీరామ్, రమేష్, సంతోష్ వెంకట్‌తో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్...

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మెరుగైన వైద్యం...

రిమ్స్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..

మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్‌ లింగాపూర్‌, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్‌, సెప్టెంబర్‌...

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే మన భారత్,...

More like this