రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి ఎక్స్ రోడ్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తలమడుగు నుంచి పొన్నారి గ్రామానికి చెందిన నరేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా, వడ్డాడి ఎక్స్ రోడ్ సమీపంలో వెనక నుంచి వేగంగా వస్తున్న మరో స్కూటీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన మురళీ (35) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ సహాయంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వడ్డాడి ఎక్స్ రోడ్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు అధికారులను కోరుతున్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొనగా, స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

More like this

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...