ఈతకు వెళ్లే విద్యార్థులకు ఎస్సై సూచన..

Published on

-Advertisement-

మన భారత్, విజయనగరం జిల్లా:
వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఈత కొట్టడానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని నెల్లిమర్ల ఎస్సై గణేష్ సూచించారు. శనివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల థామస్‌పేట ఫుట్‌బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న చంపావతి నది తీర ప్రాంతాన్ని పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ, వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు ఖాళీ సమయంలో నదులు, చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల వద్దకు ఈత కోసం వెళ్తున్నారని తెలిపారు. సరైన జాగ్రత్తలు లేకుండా నీటిలోకి దిగడం ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యంగా థామస్‌పేట ఫుట్‌బాల్ గ్రౌండ్ సమీపంలోని చంపావతి నది తీరం, అలాగే సారిపల్లి సమీప ప్రాంతాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఈతకు వెళ్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగరాదని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు, విద్యార్థులు ఒంటరిగా నదుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కోరారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

అలాగే లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలని, స్నేహితుల ప్రోత్సాహంతో సాహసాలకు పాల్పడకూడదని విద్యార్థులకు సూచించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.

వేసవి కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ పాల్దే ప్రసాద్ జన్మదినం సందర్భంగా అన్నపూర్ణ సేవా సంస్థ ట్రస్ట్...

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

More like this