కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు
-రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
-బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్ రెడ్డి
మన భారత్,మొగుళ్ళపల్లి:
విద్యార్థుల సమస్యల కోసం కాకుండా..రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని, నీచమైన రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపేందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో కాలగర్భంలో కలిపిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు సూచించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మొగులపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి మాజీ మండలాధ్యక్షుడు చెవ్వ శేషగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ నీచమైన సంస్కృతిపై ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ విద్యార్థుల సమస్యలపై స్పందించని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పుడు విద్యార్థుల పేరుతో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రూ.12 వేలకోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని ప్రభుత్వం..ఇతర అంశాలపై రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఈ నిరసన విద్యార్థుల కోసం కాదని..బీజేపీకి పోటీగా నిలబడేందుకే కాంగ్రెస్ నిరసనలు చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మోరే రవీందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం ముసుగులో కాంగ్రెస్ విధ్వంసాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సాగునీరు అందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. రైతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు అరాచకం మూకల్లా వ్యవహరించారని ఆరోపించారు. ఒకవైపు దేశ రాజధానిలో విధ్వంసాలు సృష్టిస్తూ..మరోవైపు పోలీస్ ల అండతో రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం మండల కేంద్రంలోఈ కార్యక్రమంలో పోతుగల్లు సర్పంచి ఎలిగేటి తిరుపతి ,జిల్లా నాయకులు బండారి రవీందర్ ,పోతుగంటి సాయిలు, మండల ప్రధాన కార్యదర్శి అరికాంతపు కృష్ణారెడ్డి ,మండల ఉపాధ్యక్షులు తెప్ప రాజు, రాస బిక్షపతి ,మండల నాయకులు బోయిని తిరుపతి, బూత్అధ్యక్షులు పొడిశెట్టి రవి ,తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
