అక్రమ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:
రాత్రి వేళల్లో గ్రామాల్లోకి వచ్చి లూజ్ విత్తనాలు విక్రయించే వ్యక్తులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అనుమానాస్పదంగా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని, ఎవరైనా అక్రమ విక్రయాలకు పాల్పడితే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రత్యేకంగా నిషేధిత బీటీ-3 విత్తనాలు మరియు 3 గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు సరైన ధృవీకరణ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, లైసెన్స్ లేని వ్యక్తుల వద్ద కొనుగోలు చేయడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రైతుల రక్షణ కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏవైనా సందేహాలు, ఇబ్బందులు ఎదురైన సందర్భంలో జిల్లా వ్యవసాయ అధికారి (DAO) కంట్రోల్ రూమ్ నంబర్ 89777428542 ను సంప్రదించాలని సూచించారు.

రైతులు జాగ్రత్తగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this