గోపీచంద్ కొత్త చిత్రంలో అనార్కలి ఎంట్రీ

Published on

-Advertisement-

మన భారత్ ,సినీ విభాగం:

టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తాజా చిత్రంలో హీరోయిన్‌గా కేరళకు చెందిన అనార్కలి ఎంపికైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండటం విశేషం.

అనార్కలి 1999లో కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే గ్లామర్ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, కాలేజీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. తక్కువ సమయంలోనే పలు ఫ్యాషన్ షోలు, టీవీ ప్రకటనల్లో మెరిసి గుర్తింపు పొందారు.

సినీరంగంలోకి ఆమె అడుగు 2021లో విడుదలైన మోహన్ కుమార్ ఫ్యాన్స్ చిత్రంతో పడింది. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించి తన ప్రతిభను చాటుకున్నారు. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇటీవల ప్రేమలు చిత్ర హీరో నస్లెన్ తో అనార్కలి రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.

ఇప్పటికే పలు భాషల్లో తన ప్రతిభను నిరూపించుకున్న ఈ కేరళ బ్యూటీ, గోపీచంద్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎలా మెప్పిస్తుందో చూడాలి. కొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this