గోపీచంద్ కొత్త చిత్రంలో అనార్కలి ఎంట్రీ
మన భారత్ ,సినీ విభాగం: టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తాజా చిత్రంలో హీరోయిన్‌గా కేరళకు చెందిన అనార్కలి ఎంపికైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండటం విశేషం. అనార్కలి 1999లో కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే గ్లామర్ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, కాలేజీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు....