శ్రీ మురళీకృష్ణ ఆలయంలో క్విజ్ పోటీలు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: 

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో శ్రీ మురళీకృష్ణాలయం 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఘనంగా ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఆదివారం (2026) మే 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మలపతి సుభాష్ తెలిపారు.

వార్షికోత్సవంలో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి విశేష అలంకరణలు, పుష్పార్చనలు, మంగళహారతులు నిర్వహించనున్నారు. భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. స్థానికంగా ఈ ఉత్సవానికి విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చైతన్య భాగవతం క్లిక్ పోటీలు

శ్రీ శ్రీ శ్రీ స్వామి సుందర చైతన్య రచించిన చైతన్య భాగవతం లోని శ్రీ కృష్ణుని అవతారము పై క్విజ్ పోటీలు ఉంటాయని యువత పాల్గొనాలని కోరారు.

ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు ఆత్మశాంతిని కలిగించడంతో పాటు, సమాజంలో సనాతన ధర్మం, సంప్రదాయాల పరిరక్షణకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఉత్సవ ఏర్పాట్లను సుందర సత్సంగ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్థానిక భక్తులు, గ్రామస్తులు సహకరిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this