శ్రీ మురళీకృష్ణ ఆలయంలో క్విజ్ పోటీలు..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో శ్రీ మురళీకృష్ణాలయం 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఘనంగా ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఆదివారం (2026) మే 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మలపతి సుభాష్ తెలిపారు. వార్షికోత్సవంలో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి విశేష అలంకరణలు, పుష్పార్చనలు, మంగళహారతులు...