e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ప్రయాణికులకు శుభవార్త.. 8 కొత్త రైళ్లు.!

మన భారత్, తెలంగాణ: 

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలు మరింత విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వం భాగంగా హైదరాబాద్ నగరం నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ రైళ్లు హైదరాబాద్, కాచిగూడ, చర్లపల్లి ప్రాంతాల నుంచి నడవనున్నాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక సౌకర్యం కలగనుంది. అలాగే జైపూర్, శ్రీ గంగానగర్, భువనేశ్వర్ వంటి దూర ప్రాంతాలకు ప్రయాణం సులభతరం కానుంది.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో పర్యాటకం పెరగడంతో పాటు వ్యాపార, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతమివ్వనుంది. ప్రయాణికుల రద్దీ తగ్గి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది మరో కీలక అడుగుగా నిలుస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE