కూలర్ షాక్ తో మహిళ మృతి..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు(భీంపూర్):

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కూలర్ స్విచ్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (32) ఆదివారం రాత్రి ఇంట్లో కూలర్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డ్‌ను తాకింది. ఈ క్రమంలో స్విచ్ బోర్డ్‌లోని ప్రధాన తీగలు తగలడంతో ఆమెకు తీవ్రంగా విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మృతురాలికి భర్త సురేందర్, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వేసవి కాలంలో కూలర్లు, విద్యుత్ పరికరాలు వినియోగించే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this