సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:
తలమడుగు మండల కేంద్రంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ మాఫ్త్ బిజిలి పథకం ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఈవెంట్ మేనేజర్ వన్నెల సుధీర్ మాట్లాడుతూ గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం పరిమితంగా ఉన్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా అనేక గిరిజన గ్రామాలకు సరైన విద్యుత్ సరఫరా అందని పరిస్థితి ఉన్నందున, సౌర శక్తి వినియోగం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పథకాల ద్వారా ప్రజలకు సోలార్ ప్యానెల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోందని చెప్పారు. 1 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ యూనిట్లకు రూ.55 వేల నుంచి రూ.70 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, అందులో కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల వరకు, రాష్ట్ర మరియు ఇతర వనరుల ద్వారా అదనంగా రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు సహాయం అందుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాంప్రసాద్, ఆదిలాబాద్ జిల్లా సోలార్ సిస్టమ్ ఇన్‌చార్జ్ వన్నెల సుధీర్, తలమడుగు గ్రామ సర్పంచ్ ఏలుగు రాజన్న, సెక్రటరీ గజానన్, అలాగే గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో సోలార్ విద్యుత్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణ హితమైన శక్తి వినియోగం వైపు మళ్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this