గిరిజన బాలికల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు వేదిక

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు) ఉమ్రి టీ హాస్టల్ వార్డెన్ హి రామన్  “మన భారత్”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థినుల సంక్షేమంపై కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను గిరిజన బాలికలు సద్వినియోగం చేసుకుని చదువులో ముందంజలో నిలవాలని ఆయన సూచించారు.

మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చే బాలికలకు ఈ ఆశ్రమ పాఠశాలలు ఉత్తమ వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, ఎస్ఎస్సీ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో నాణ్యమైన బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థినులకు పాఠాలు బోధిస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.

అదనంగా, విద్యార్థినులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఆరు జతల యూనిఫాంలు అందించబడుతున్నాయని, విశాలమైన తరగతి గదులు, ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరుగుతుందని వివరించారు. డిజిటల్, ఏఐ ఆధారిత బోధనతో పాటు కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీలు అందుబాటులో ఉండటంతో విద్యార్థినుల జ్ఞానం విస్తరిస్తోందని తెలిపారు.

హాస్టల్‌లో రుచికరమైన, పోషకాహార భోజనం అందించడంతో పాటు ప్రత్యేక తరగతులు, వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థినుల అభివృద్ధికి దోహదం చేస్తున్నామని చెప్పారు. అలాగే మనోవికాసం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహిస్తూ, బాలికలకు యోగా, కరాటే శిక్షణ కూడా ఇస్తున్నామని వెల్లడించారు.

గిరిజన ప్రాంతాల బాలికలు ఈ అవకాశాలను వినియోగించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని హి రామన్ గారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ విద్యా వసతులు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్:  ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల...

More like this