జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు..

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ZPTC), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అడుగులు వేసింది. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

గత డిసెంబర్ నెలలో గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికలు విజయవంతంగా పూర్తికాగా, అనంతరం మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న మండల, జిల్లా ప్రజాపరిషత్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా కసరత్తు చేపట్టింది.

ఈ క్రమంలో ఓటర్ల జాబితా తయారీపై అధికారులు దృష్టి సారించారు. కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుండి 2026 ఫిబ్రవరి 5 వరకు సమీకరించిన ఓటర్ల డేటా ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. నియోజకవర్గాల వారీగా కొత్త ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల ప్రకారం వర్గీకరించాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ ప్రకారం ఓటర్ల డేటాను పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాల్సి ఉంటుంది. డేటాలో ఎలాంటి లోపాలు ఉన్నా ఈ నెల 23వ తేదీ లోపు నివేదించాలని, అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి, ప్రజల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలను మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే దిశానిర్దేశం చేయబడింది.

ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మళ్లీ ఉత్సాహభరితంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు...

షార్ట్ సర్క్యూట్ పాలిచ్చే పాడి ఆవు మృతి..

ఇస్సిపేటలో షార్ట్ సర్క్యూట్‌తో పాలిచ్చే పాడి ఆవు మృతి రూ.80 వేల విలువైన పాడి ఆవు కోల్పోయిన రైతు ఆవేదన నష్టపరిహారం...

డ్రగ్స్ రహిత నిర్మాణానికి యువత భాగస్వామ్యం కావాలి

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా 5K రన్ – 2 వేల...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి..

కూరగాయల బుట్టలు ఖాళీగానే మిగిలాయి... ఇద్దరి ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్, మావల ,మన భారత్: ప్రతి రోజు మాదిరిగానే...

More like this