ఉచిత ట్యూషన్ సెంటర్‌కు గ్రీన్ బోర్డు..

Published on

-Advertisement-

మన భారత్, వాంకిడి :

స్థానిక పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా దాతలు ముందుకు వస్తున్నారు. వాంకిడిలోని జెత్వాన్ బుద్ధ విహార్‌లో నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ సెంటర్‌కు అవసరమైన గ్రీన్ బోర్డును భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ శ్రామినేర్ హంసరత్న వినేష్ ఉప్రే టీచర్ దాతృత్వంగా అందజేశారు.

గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఈ ట్యూషన్ సెంటర్ విద్యార్థులకు మంచి ఫలితాలు అందిస్తోంది. ఇటీవల ప్రకటించిన గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు సీట్లు సాధించడం గమనార్హం. విద్యార్థుల బోధనకు అవసరమైన కనీస సదుపాయాల లోపాన్ని గుర్తించిన వినేష్ ఉప్రే గారు, గ్రీన్ బోర్డు అందించి విద్యార్థుల అభ్యాసానికి తోడ్పడ్డారు.

ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు దుర్గం సందీప్ మాట్లాడుతూ, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం గ్రీన్ బోర్డు దానం చేసిన వినేష్ ఉప్రే ని శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ట్యూషన్ సెంటర్ నిర్వాహకులు ప్రతాప్, మిలింద్, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్రె విజయ్, సహాయ కార్యదర్శి రోషన్, కోశాధికారి నగసేన, కార్యవర్గ సభ్యులు డోంగ్రే రమేష్, సమాజ పెద్దలు శ్యామరావు, రాజేశ్వర్, సమతా సైనిక్ దల్ మార్షల్స్ సాజన్ ఉప్రే, కమలాకర్, స్వాగత్, బుద్ధాజి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత ట్యూషన్ సద్వినియోగం చేసుకోవాలి..

వేసవి సెలవుల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు జెత్వాన్ బుద్ధ విహార్‌లో ఉచిత ట్యూషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. నవోదయ, గురుకుల, ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సీఆర్పీ దుర్గం సందీప్ సూచించారు.

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this