e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా

-వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై లెక్క చెప్పాలి: బోనగిరి రాజేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిందని సంబరాలు చేసుకునే ముందు, బీసీలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందో ప్రజలకు లెక్క చెప్పాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ డిమాండ్ చేశారు.అధికారంలోకి రాకముందు బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.ప్రత్యేకంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో, ఎన్ని ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

వెయ్యి రోజుల పాలన పూర్తయిందని పండగ చేసుకోవడం కంటే, ఈ వెయ్యి రోజుల్లో బీసీల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన హామీలు, కేటాయించిన నిధులు, బీసీలకు అందిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బోనగిరి రాజేష్ డిమాండ్ చేశారు.“బీసీలకు కావాల్సింది సభలు, సంబరాలు, ప్రచారాలు కాదు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి, ఆర్థిక భరోసా, రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా కావాలి” అని ఆయన అన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేయడం ప్రతిపక్షాల బాధ్యత మాత్రమే కాదని, వాటి అమలుపై ప్రశ్నించడం ప్రజల హక్కు కూడా అని బోనగిరి రాజేష్ పేర్కొన్నారు.“వెయ్యి రోజుల పండగ చేసుకోవడం కంటే… వెయ్యి రోజుల్లో బీసీల కోసం చేసిన పనుల లెక్క చెప్పండి. పండగలతో కాదు… పనులతోనే బీసీలకు న్యాయం జరగాలి” అని ఆయన అన్నారు.రానున్న రోజుల్లో బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం మరింత బలమైన ఉద్యమాన్ని చేపడతామని బోనగిరి రాజేష్ తెలిపారు.

“అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడి, రానున్న రోజుల్లో బీసీల రాజ్యాధికారం సాధించడం ఖాయం. బీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత లభించాలంటే బీసీల రాజకీయ శక్తి మరింత బలపడాలి” అని బోనగిరి రాజేష్ స్పష్టం చేశారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE