హాల్ టికెట్లు లేక విద్యార్థుల్లో ఆందోళన..!

Published on

-Advertisement-

మన భారత్, ఎడ్యుకేషన్:

Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడం సమస్యగా మారింది.

హాల్ టికెట్లు లేకుండా పరీక్షలకు ఎలా హాజరుకావాలనే అనుమానంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చివరి నిమిషంలో హాల్ టికెట్లు విడుదల అవుతాయనే సమాచారం రావడంతో, ఒక్క రోజులోనే వాటిని సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.

ఇక మండుటెండల మధ్య పరీక్షలు నిర్వహించడంపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి హాల్ టికెట్లు అందించకపోవడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. యూనివర్సిటీ అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఈ ఆలస్యం విద్యార్థులపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడుతున్నారు.

పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని, వెంటనే హాల్ టికెట్లు విడుదల చేసి విద్యార్థుల ఆందోళన తొలగించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Latest articles

ఆ మంత్రికి అనారోగ్యం.. యథావిధిగా సమావేశం

మన భారత్, తెలంగాణ :  ఉట్నూరు సమీక్షకు జూపల్లి, అడ్లూరి గైర్హాజరు.. కలెక్టర్లతో సమావేశం యథావిధిగా మన భారత్, ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్...

వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన భారత్, హైదరాబాద్: ఈ ఏడాది ఎల్‌నినో...

వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్

108 అంబులెన్స్‌లో పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ లేదండి.. వైరల్ ప్రచారాన్ని నమ్మొద్దు: 108 ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ మన భారత్, ఆదిలాబాద్:...

డ్రైనేజీ సమస్య పట్టించుకోరా.!

మన భారత్ | తలమడుగు కొత్తూరులో డ్రైనేజీ సమస్య తీవ్రం.. కొత్త నాళాలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ తలమడుగు, జూలై 19:...

More like this