e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

పంట నష్టం బాధిత కుటుంబానికి పరామార్శ..

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో అగ్నిప్రమాదంతో జొన్న పంట కాలిపోవడంతో బాధిత రైతును స్థానిక నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ మోర్గు ఆశన్న పంటచేనులో జరిగిన ఈ ఘటనతో రైతుకు భారీ నష్టం సంభవించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసిలు గోక గణేష్ రెడ్డి, బొల్లారపు బాబన్న, ఉపసర్పంచ్ శ్రీరామ్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆశన్నను ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని వారు కోరారు.

అదే విధంగా దేవాపూర్ గ్రామానికి చెందిన అజీజ్ పటేల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో, ఆయన మేనల్లుడు మరణించిన నేపథ్యంలో నాయకులు ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కే ప్రతాప్, రాజారెడ్డి, పాట్నా నరసయ్య, వెంకన్న యాదవ్, సలీం, ఆశకాలి, లచ్చన్న, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE