కాలిపోయిన జొన్న పంట.. రైతుకు ఎమ్మెల్యే అండ

Published on

-Advertisement-

మన భారత్ , తలమడుగు: 

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో జరిగిన విషాదకర ఘటనలో రైతు అజీస్ పటేల్‌కు చెందిన జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై స్పందించిన బోథ్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం గ్రామానికి చేరుకుని కాలిపోయిన పంట పొలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జొన్న పంట పూర్తిగా దగ్ధమవడంతో రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ఈ ఘటన చాలా బాధాకరమని, రైతులు అధైర్యపడకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, తప్పకుండా పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇకపోతే, కేవలం వరి పంటలకే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో పండించే అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫసల్ భీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు అభిరాం రెడ్డి, బోథ్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్, బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

రైతులకు ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this