e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..

మన భారత్, ధన్వాడ : 

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్వాడ మండలంతో పాటు పరిసర గ్రామాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

మండలంలోని గోటూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం, యువజన సంఘం అధ్యక్షుడు చుక్కల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగమణి, మాజీ ఉపసర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.

అదేవిధంగా ధన్వాడ కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీ కాలనీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ ఆలోచనలు, సమానత్వ సందేశాన్ని ప్రజలకు వివరించారు.

కిష్టాపూర్ గ్రామంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కొండయ్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.

మొత్తంగా ధన్వాడ మండలంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉత్సాహభరితంగా సాగాయి. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యతపై నాయకులు పిలుపునిచ్చారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE