ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..
మన భారత్, ధన్వాడ : రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్వాడ మండలంతో పాటు పరిసర గ్రామాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మండలంలోని గోటూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం, యువజన సంఘం అధ్యక్షుడు చుక్కల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగమణి, మాజీ ఉపసర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొని...