ఎండలో రేషన్ కోసం బారులు.!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

మండల కేంద్రంలోని రేషన్ షాపు వద్ద గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రేషన్ షాప్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఎండలోనే గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం రేషన్ పంపిణీ శ్రీ వెంకటేశ్వర ఆలయ విశ్రాంతి గదిలో నిర్వహిస్తున్నప్పటికీ, అక్కడ సరిపడ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎండలో నిలబడి వేలిముద్రలు పడకపోవడంతో ఎక్కువసేపు లైన్లో వేచి ఉండాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

తాగునీటి సౌకర్యం లేకపోవడం, షెల్టర్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇంతకుముందే తలమడుగు మండల కేంద్రానికి రేషన్ షాప్ కోసం చింత భవనం మంజూరు అయినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు పూర్తి కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలం బస్టాండ్ వద్ద ఖాళీగా ఉండిపోవడం కూడా సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.

శాశ్వత భవనం నిర్మాణం పూర్తయితే ప్రజలకు నీడతో పాటు కనీస సౌకర్యాలు లభిస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ షాప్‌కు శాశ్వత భవనం నిర్మించడమే కాకుండా, తాత్కాలికంగా అయినా షెల్టర్, తాగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

🔖 మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this