ప్రజల భద్రతే ధ్యేయం: ఎస్సై సురేష్

Published on

-Advertisement-

మన భారత్ , మొగుళ్లపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రజల భద్రతను కాపాడేందుకు పోలీసులు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కాలంగా నిరుపయోగంగా ఉన్న 24 సీసీ కెమెరాలను మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ స్వయంగా చొరవ తీసుకొని మరమ్మత్తులు చేయించి తిరిగి పనిచేసేలా పునరుద్ధరించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మండల కేంద్రంలో భద్రతా వ్యవస్థ కొంత బలహీనపడిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించడం ద్వారా భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించడం సులభమవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే అవకాశాలు పెరుగుతాయని ఆయన వివరించారు. ఈ చర్యలతో మండల ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరుగుతుందని, పోలీసులపై విశ్వాసం మరింత బలపడుతుందని తెలిపారు.

ప్రజల రక్షణే లక్ష్యంగా, గ్రామాల భద్రతే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొంటూ, మండలంలో నేరాలను నియంత్రించేందుకు, దొంగతనాలను అరికట్టేందుకు ఎస్ఐ తీసుకుంటున్న చర్యలను స్థానిక అధికారులు, ప్రజలు అభినందిస్తున్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ -బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను...

వ్యాన్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి

మన భారత్, ఆదిలాబాద్ వ్యాన్‌ను ఢీకొన్న బైక్.. ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడు అక్కడికక్కడే మృతి ఆదిలాబాద్, జూలై...

చోరీ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్ సీసీటీవీ ఆధారాలతో ద్విచక్ర వాహన చోరీ ముఠా గుట్టురట్టు.. 7 బైక్‌లు స్వాధీనం, నలుగురు అరెస్ట్ ఆదిలాబాద్,...

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

More like this