మన భారత్, ఆదిలాబాద్:
పిప్పిరి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ముందుండి నాయకులతో కలిసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ శ్రావణ్ కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం, ఉప ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
పిప్పిరి సభకు భారీగా జనసందోహం తరలివచ్చి, కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో ఆసక్తి కనిపించింది.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
