హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

తాంసి, తలమడుగు మండలాల పరిధిలోని అంతర్రాష్ట్ర రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పొన్నారి గ్రామ శివారులో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సిఐ పనిధర్, ఎస్సైలు రాధిక, జీవన్ రెడ్డి లతో కలిసి ప్రమాదప్రవణ ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, వేగ నియంత్రణ పాటించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా అనుసరించాలని పోలీసులు సూచించారు.

ప్రమాదాల నివారణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ బోర్డుల ఏర్పాటు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రహదారిపై భద్రతను మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తలమడుగు , తాంసీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానికులు పోలీసుల ఈ చర్యలను అభినందిస్తూ, ప్రమాదాలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this