అంతర్రాష్ట్ర రహదారిపై భయంకర మూల మలుపులు

Published on

-Advertisement-

మన భారత్ , తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్ర పరిధిలో ఉన్న సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఉండం గ్రామ సమీపంలో ఉన్న ఈ మూలమలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారి ద్వారా తెలంగాణ–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య రోజూ వందలాది మంది ప్రయాణం సాగిస్తారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు ప్రయాణించే ప్రజలకు ఈ మార్గం కీలకంగా ఉంది. అయితే, ఉండం గ్రామం వద్ద ఉన్న ప్రమాదకర మలుపు వాహనదారులకు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం, గతంలో ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ముఖ్యంగా భారీ వాహనాలు,  లారీలు రోజూ పెద్ద సంఖ్యలో ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగింది.

ఇక వాహనదారులు ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉండం, సుంకిడి గ్రామాల ప్రజలు కొన్ని కీలక డిమాండ్లు చేశారు. రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాలను తొలగించడం, రోడ్డును విస్తరించడం, అలాగే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ చర్యలు తీసుకుంటే వాహనాలు నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉండి ప్రమాదాలను నివారించవచ్చని వారు పేర్కొన్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this