రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఐకి తీవ్ర గాయాలు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్/మహారాష్ట్ర సరిహద్దు:

రోడ్డు ప్రమాదంలో తాంసి మండలానికి చెందిన ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) సంతోష్ తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని యావత్‌మాల్‌లో బంధువులను కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

పిప్పర్‌వాడ ప్రాంతం సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సంతోష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంతోష్‌ను నిజామాబాద్‌కు తరలించినట్లు తెలిసింది.

ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ప్రమాదాల నివారణకు రహదారుల భద్రతపై మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Latest articles

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...

రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను...

More like this