నీటి ఎద్దడి నివారణకు చర్యలు.!

Published on

-Advertisement-

మన భారత్, భీంపూర్:

వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 5వ వార్డులోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల సమీపంలో కొత్త బోరు ఏర్పాటు చేయించారు.

సుమారు రూ.50 వేల వ్యయంతో తవ్వించిన ఈ బోరులో సమృద్ధిగా నీరు లభించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజలకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి సమస్య తీవ్రరూపం దాల్చకుండా ముందస్తు చర్యలుగా ఈ బోరు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ బోరు వద్ద చేతి పంపు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల అవసరాల దృష్ట్యా ఇటువంటి పనులను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

స్థానికులు సర్పంచ్ చర్యలను అభినందిస్తూ, తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this