తాత కోపం.. పంటకు నిప్పు పెట్టిన మనవడు

Published on

-Advertisement-

మన భారత్ , ఆదిలాబాద్: 

తాత మందలించాడనే ఆగ్రహంతో మనవడు పొలంలో ఉన్న పంటకు నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలంలో కలకలం రేపింది. మండలంలోని పెండల్వాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు తన మనవడు సునీల్ పనీపాటా లేకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడని మందలించినట్లు తెలుస్తోంది. పెద్దల మాట వినకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో మందలించడంతో సునీల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు.

తాత మందలింపుతో కోపోద్రిక్తుడైన సునీల్, ఇంటి వద్ద ఉన్న పొలానికి వెళ్లి అక్కడ కుప్పగా పోసి ఉంచిన శనగ పంటకు నిప్పు పెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. మంటలు చెలరేగడంతో కళ్లముందే పంట మొత్తం బూడిదైపోయింది. కష్టపడి పండించిన పంట నాశనం కావడంతో రైతు ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ప్రభాకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబంలో జరిగిన చిన్న గొడవ ఇలా పెద్ద నష్టానికి దారి తీసిన ఘటనపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతలో సహనం, బాధ్యతాభావం పెరగాల్సిన అవసరం ఉందని స్థానిక పెద్దలు సూచిస్తున్నారు

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this