తాత కోపం.. పంటకు నిప్పు పెట్టిన మనవడు
మన భారత్ , ఆదిలాబాద్: తాత మందలించాడనే ఆగ్రహంతో మనవడు పొలంలో ఉన్న పంటకు నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలంలో కలకలం రేపింది. మండలంలోని పెండల్వాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు తన మనవడు సునీల్ పనీపాటా లేకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడని మందలించినట్లు తెలుస్తోంది. పెద్దల మాట వినకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో మందలించడంతో సునీల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ...