e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

వికలాంగుల పెన్షన్ పెంచాలని నిరాహార దీక్షలు..

మన భారత్, హైదరాబాద్:

వికలాంగుల పెన్షన్‌ను నెలకు ₹6000లకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంఘాలు ఉద్యమాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో NPRD తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వికలాంగులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. పెన్షన్ పెంపుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2026–27 బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు.

దీక్షలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వికలాంగుల జీవన పరిస్థితులు రోజురోజుకు క్లిష్టంగా మారుతున్నాయని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయాల దృష్ట్యా ప్రస్తుతం అందుతున్న పెన్షన్ సరిపోవడం లేదని, కనీస జీవన భద్రత కోసం వికలాంగుల పెన్షన్‌ను ₹6000లకు పెంచి 2023 డిసెంబర్ నుండి అమలు చేయాలని వారు ప్రభుత్వాలను కోరారు. అలాగే ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు అవసరమైన సహాయ పరికరాలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా V.B. Giri Act – 2025 ను రద్దు చేయాలని కూడా వారు ప్రభుత్వాలను కోరారు. వికలాంగుల హక్కులు మరియు సంక్షేమాన్ని పరిరక్షించే విధంగా స్పష్టమైన విధానాలను రూపొందించాలని నాయకులు పేర్కొన్నారు. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరాహార దీక్షలకు పలువురు ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి, NPDO అధ్యక్షులు నల్గొండ శ్రీనివాస్, TVHSS అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ తదితరులు పాల్గొని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

అదేవిధంగా సీనియర్ వికలాంగుల నాయకులు నాగభూషణం, ఉదయ్ అసోసియేషన్ ప్రతినిధులు కొమురమళ్ళు, నాగరాజు, తెలంగాణ మరగుజ్జుల అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశం, తెలంగాణ హిమోఫీలియో సొసైటీ ప్రతినిధి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో NPRD రాష్ట్ర అధ్యక్షులు కే. వెంకట్, ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య, కోశాధికారి ఆర్. వెంకటేష్, రాష్ట్ర నాయకులు జెర్కొని రాజు, యశోద, నాగలక్ష్మి, కాషాప్ప, లింగయ్య, గంగాధర్, స్వామి, ఉపేందర్ తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

వికలాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, పెన్షన్ పెంపుతో పాటు ఉపాధి అవకాశాలు, వైద్య సదుపాయాలు, సహాయక పరికరాల పంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE