ఆదిలాబాద్ 19వ వార్డులో బీజేపీ జెండా ఎగిరింది

Published on

-Advertisement-

మెస్రం విలాస్ ఘన విజయం – 269 ఓట్ల మెజారిటీతో గెలుపు

మన భారత్ ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి మెస్రం విలాస్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మెస్రం విలాస్‌కు 713 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్‌కు 444 ఓట్లు దక్కాయి.

దీంతో మెస్రం విలాస్ 269 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

19వ వార్డులో ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనను దృష్టిలో పెట్టుకొని బీజేపీకి మద్దతు తెలిపారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మెస్రం విలాస్ హామీ ఇచ్చారు.

ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ బలం మరింత పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this